ATP: ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రేపు ఉరవకొండ మండలానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో రైతులకు డ్రిప్ & స్ప్రింక్లర్లు పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం రాగులుపాడు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి హంద్రీనీవా కాలువ వెడల్పు పనుల పరిశీలన కార్యక్రమంలో పయ్యావుల కేశవ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు.