సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని గీతానగర్లో బాల రాముడి ప్లెక్సీకి రాముడు భక్తులు బుధవారం పూజలు నిర్వహించారు. వాళ్ళు మాట్లాడుతూ.. అయోధ్యలో బాల రాముడిని ప్రతిష్టించి నేటికి సంవత్సరం అయిన సందర్భంగా పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమ ఏర్పాటు చేశారు. అలాగే బాల రాముడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.