ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు స్థలం, ఇంటి నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు.