కృష్ణా: జిల్లాలో వినియోగదారుల నుంచి గ్యాస్ డీలర్లు, డెలివరీ బాయ్స్ అదనంగా డబ్బు వసూలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బుధవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. అదనంగా డబ్బు వసూలు చేయడంపై సీఎంఓ కార్యాలయానికి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అదనపు వసూళ్లు రుజువైతే డీలర్ షిప్పులు రద్దు చేస్తామని హెచ్చరించారు.