JN: పాలకుర్తి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించే సే నో టు డ్రగ్స్ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన నియోజకవర్గ ఇంఛార్జ్ ఝాన్సీ రెడ్డితో కలిసితోపాటు ఎమ్మెల్యే పాల్గొంటారని పాలకుర్తి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు.