ప్రకాశం: రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీల పరిష్కారం, రీ సర్వేపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. మంగళవారం ఆయా అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిందని కలెక్టర్ పేర్కొన్నారు.