BPT: సంతమాగులూరు మండలంలోని మామిళ్ళపల్లి, తంగేడు మళ్ళీ గ్రామాల్లో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని మండల వెటర్నరీ అధికారులు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాల్లో గొర్రెలు, మేకలకు పరీక్షలు నిర్వహించారు. అలాగే పశువులు దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. గ్రామాలను గేదలకు గర్భకోశ వ్యాధులకు సంబంధించి చికిత్స చేశారు.