HYD: గతంలో ఏ పథకాలకు దరఖాస్తు చేసుకోనివారు కూడా ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రులు సూచించారు. ఈనెల 24 వరకు జరగనున్న గ్రామసభల నిర్వహణ, ప్రజల స్పందన, నాలుగు పథకాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో మంగళవారం సాయంత్రం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.