కృష్ణా: విజయవాడ నగరంలో పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం రాత్రి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ రాజారాజేశ్వరిపేట 21 బ్లాక్, వైయస్సార్ కాలనీ ప్రాంతాల్లో సైబర్ నేరాలైన హనీ ట్రాప్, సెక్స్ టార్షన్ వీడియో రూపంలో ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు.