KKD: జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమానికి ప్రజా సమస్యలపై 370 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.