జనగామ: ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో బాలిక స్కూలుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఒంటరిగా ఉన్న బాలికపై అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.