మహబూబ్బాద్: ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వ్యక్తులపై కఠిన చర్యలతో పాటు తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ అంబేద్కర్ ఎదుట లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు నిరసన తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమా నాయక్ మాట్లాడుతూ.. జనవరి 30న మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతామని తెలిపారు.