HYD: మల్కాజిగిరి పరిధి మధురానగర్, MIGH కాలనీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా గార్బేజి వ్యర్థాలు తీసుకెళ్లడానికి స్వచ్ఛ ఆటో వారు రావడం లేదని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేవలం 3 గంటల్లోనే స్పందించిన అధికారులు, ప్రత్యేక సిబ్బంది పంపించి, గార్బేజీని వెంటనే తొలగించారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.