ADB: కలెక్టర్ లబ్ధిదారుల ఎంపికకు నిర్వహించే సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం ఆదిలాబాద్‌లోని అనుకుంటలో సర్వేను ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పై సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలను సేకరించారు.