కోనసీమ: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వచ్చిన ప్రజలకు సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు APSRTC రావులపాలెం డిపో మేనేజర్ G.V. V రమణ బుధవారం తెలిపారు.16వ తేదీ నుంచి హైదరాబాద్కు నాన్ స్టాప్, విజయవాడ బైపాస్ సర్వీస్, విశాఖపట్నం, సాలూరు, పార్వతీపురం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఆన్లైన్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవాలన్నారు.