AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సెమిస్టర్ల వారీగా అన్నింటిని కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురానుంది. ఒకటి, రెండు తరగతులకు మొదటి సెమిస్టర్ అన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా, రెండో సెమిస్టర్లోనూ అన్ని సబ్జెక్టులకు కలిపి ఒక పాఠ్యపుస్తకంగా ఇవ్వనుంది. 3-5 తరగతుల పుస్తకాల బరువు కూడా తగ్గనుంది.