ప్రకాశం: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన వాగ్దానం మేరకు పేదలకు ఇంటి స్థలం కల్పించి గృహాలు నిర్మించాలని సంతమాగులూరు మండలం సీపీఐ నాయకులు పేర్కొన్నారు. సీపీఐ నేతలు నిరసన తెలిపి తహసీల్దార్‌కి వినతి పత్రం అందించారు. అనంతరం వాళ్ళు మాట్లాడుతూ.. ఇల్లు లేని పేదలకు పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు చొప్పున స్థలాలు అందించాలన్నారు.