HYD: వీధి వ్యాపారులను ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పెట్టడం సరికాదని మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ దీపిక అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉండే వీధి వ్యాపారస్థులను ఆమె కలిశారు. తరచూ ట్రాఫిక్ పోలీసుల బెదిరింపులతో ఇబ్బందులు పడుతున్నామని వారు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు. ట్రాఫిక్ ఏసీపీతో మాట్లాడి, తగిన చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.