NRPT: అంబులెన్స్‌లో మహిళా ప్రసవించిన ఘటన నారాయణపేట మండలంలో జరిగింది. మండల పరిధిలోని పేరపల్ల అనుబంధ గ్రామంలోని మీది తండాకు చెందిన రవళికకు ఉదయం పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. కాగా మార్గం మధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది . EMT తాజుద్దీన్, పైలట్ రవికుమార్ సకాలంలో తగిన చర్యలు తీసుకున్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.