కడప: జమ్మలమడుగు పట్టణంలో వెలిసిన శ్రీశ్రీశ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాస మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులయ్యారు.