HYD: మల్లెపల్లి డివిజన్ పరిధిలో పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కార్పొరేటర్ జాఫర్ ఖాన్ అన్నారు. సోమవారం జలమండలి జీఎం జానీ షరీఫ్ తో కార్పొరేటర్ సమావేశం అయ్యారు. డివిజన్ పరిధిలో ఉన్న అభివృద్ధి పనులు, పెండింగ్ అభివృద్ధి పనులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గడువులోగా పనులను ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు.