VSP: నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేవారు ముందుగా పోలీసు అనుమతులు తీసుకోవాలని పాడేరు డీఎస్పీ కే.ప్రమోద్ సూచించారు. స్థానిక లాడ్జిల యజమానులు, వంజంగి రిసార్టుల నిర్వాహకులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. లాడ్జి, రిసార్టుల ఎంట్రీ, ఎగ్జిట్ ప్రదేశాల్లో సీసీ టీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని హెచ్చరించారు.