VKB: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కథనం..యూపీకి చెందిన ఎండీ ఫిరోజ్ (42) దూలపల్లిలోని ప్రశాంత్ నగర్లో ఉంటూ పెయింటింగ్ పనులు చేసేవాడు. డబ్బుకోసం గంజాయి సరఫరా చేయడం ప్రారంభించాడు. వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని తెచ్చివిక్రయిస్తున్నాడు.