BDK: జిల్లాలో డిసెంబర్ 31 వేడుకలను యువత తమ ఇళ్లలోనే జరుపుకోవాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఓ ప్రకటనలో సూచించారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు అప్రమత్తం చేసినట్టు తెలిపారు. యువత మద్యం తాగి అర్ధరాత్రి 12 గంటల తర్వాత రహదారులపై విచ్చలవిడిగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.