MDK: అక్రమ సంబంధం అంటగట్టి బెదిరింపులకు పాల్పడడంతో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. నర్సాపూర్ చెందిన ఓ టిఫిన్ సెంటర్ యజమాని దివ్య హెడ్ కానిస్టేబుల్‌తో ఫోన్లో మాట్లాడింది. ఇది గమనించిన ఆమె భర్త, అల్లుడు చంపుతామని బెదిరించారు. దీంతో సాయి ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య శైలజ తెలిపారు.