NLG: కాంగ్రెస్ ప్రభుత్వం, మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో నాంపల్లి మండల రూపు రేఖలు మారనున్నాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. మండలానికి R&B, విద్యుత్, పంచాయతీరాజ్ రోడ్లు, LOC లు, MP, MLA నిధులు నుంచి మండల అభివృద్ధికి మొత్తంగా రూ. 141 కోట్ల 83 లక్షల 47 వేల 500 నిధులు మంజూరైనట్లు ఆదివారం తెలిపారు.