VZM: వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఆసక్తి గల అబ్యర్దులు జనవరి 2 లోగా దరఖాస్తు చేసుకోవాలని విజయనగరం మునిసిపల్ కమీషనర్ పి.నల్లనయ్య ఆదివారం సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలాక్టిషియన్, టీవీ, వాషింగ్ మిషన్, గ్రీజర్, రిఫ్రిజిరేటర్, ప్లంబింగ్, కార్పెంటర్స్కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.