SRPT: ఏకరం పొలం ఉంటే ఏ పంట వేద్దాం, ప్లాట్లు చేస్తే ఎంత లాభమొస్తది అని లెక్కలేసుకునే రోజులివి. కానీ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న తనకున్న 70 ఎకరాల భూమిని చెట్లు పెంచేందుకు, మూగజీవాలకు ఆవాసంగా మార్చేశారో ప్రకృతి ప్రేమికుడు జలసాధన సమితి దుశ్చర్ల సత్యనారాయణ. జీవరాశులకు ఆహారం నీరు అందించాలన్న సదుద్దేశంతో కోట్ల విలువ చేసే భూమిని అడవిగా మార్చేశారు.