కృష్ణా: అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో జనవరి 7,8,9,10 తేదీలలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అవనిగడ్డ మండల ధర్మచార్యులు అన్నపరెడ్డి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని రామాలయం వద్ద ప్రత్యేక ధార్మిక కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు.