»Bjp Worker Bombed Hacked To Death On Busy Road In Puducherry
Viral Video: బీజేపీ నేతను నరికి చంపిన దుండగులు
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు బీజేపీ(BJP) నేతను నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాండిచ్చేరి హోం మినిస్టర్ నమశ్శివాయం బంధువైన సెంథిల్ కుమార్(Senthil kumar)ను విల్లియానూర్ అనే రద్దీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రద్దీ ప్రాంతంలో రోడ్డు పక్కన ఆయన టీ తాగుతుండగా అంతలోనే ఏడుగురు దుండగులు బైకులపై అక్కడికి చేరుకున్నారు.
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి(Puducherry)లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు బీజేపీ(BJP) నేతను నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాండిచ్చేరి హోం మినిస్టర్ నమశ్శివాయం బంధువైన సెంథిల్ కుమార్(Senthil kumar)ను విల్లియానూర్ అనే రద్దీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రద్దీ ప్రాంతంలో రోడ్డు పక్కన ఆయన టీ తాగుతుండగా అంతలోనే ఏడుగురు దుండగులు బైకులపై అక్కడికి చేరుకున్నారు.
మొదటగా ఓ వ్యక్తి సెంథిల్(Senthil)పై నాటు బాంబులను విసిరాడు. దీంతో సెంథిల్ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆ తర్వాత ఆ దుండగులు కర్రలు, కత్తులతో సెంథిల్ పై దాడికి దిగారు. ఆయన్ని క్రూరంగా కత్తితో నరికి అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన సీసీటీవీ(CCTV) కెమెరాల్లో రికార్డయ్యింది.
సెంథిల్ కుమార్(Senthil kumar) హత్య విషయం తెలిసిన వెంటనే హోం మంత్రి నమశ్శివాయం, బంధువులు, 700 మంది బీజేపీ(BJP) కార్యకర్తలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చనిపోయిన సెంథిల్ ను చూసి హోం మంత్రి నమశ్శివాయం, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలించగా సోమవారం ఆ ఏడుగురు ట్రిచీ కోర్టులో లొంగిపోయారు. ప్రస్తుతం సీసీటీవీ(CCTV) వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.