SKLM: టెక్కలి డివిజన్ పరిధిలో రేషన్ డిపో డీలర్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్డీవో కృష్ణమూర్తి తెలిపారు. టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, సారవకోట, ఎల్ఎన్ పేట, హీరమండలం, మెళియాపుట్టి, కొత్తూరు, పాతపట్నం మండలాల్లోని 59 డిపోల్లో డీలర్లను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జనవరి 9 లోగా టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Tags :