TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. కేంద్రమంత్రి బండి సంజయ్, సీపీఐ నేత నారాయణ, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, మాజీమంత్రి కేటీఆర్ మన్మోహన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ పాత్ర మరువలేనిదని పొన్నం అన్నారు.