W.G: నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన దేనాబోయిన అమర్నాథ్ కుమార్తె సునీత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై వీరబాబు తెలిపారు. సునీత నిడదవోలు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియెట్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతుందని.. ఈనెల 27న ఉదయం కళాశాలకు వెళ్లి ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదని, అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.