ELR: పోలవరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేయడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రహదారిపై రాకపోకలు సాగించే ప్రజలు, విద్యార్థులు, వాహనదారులపై మీదకు వచ్చి మొరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. కోళ్ళు, మేకలు, లేగదూడలపై దాడి చేస్తున్నాయన్నారు. పంచాయతీ అధికారులు స్పందించి కుక్కలను జనావాసాలు లేని దూర ప్రాంతాల్లో విడిచి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.