ప్రకాశం: అద్దంకి పట్టణంలోని సీపీఐ కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం సీపీఐ శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్గ సభ్యులు చెల్లి విల్సన్ పోనీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఐ అణగారిన వర్గాలకు, కష్టజీవులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.