ELR: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. 90 రోజులుగాను రూ.9లక్షల 54 వేల 726 రూపాయలు హుండీల ద్వారా ఆదాయం వచ్చినట్టు కార్యనిర్వహణ అధికారి తెలియజేశారు. ఇందులో దేవాలయ ధర్మాదాయ శాఖ ఏలూరు ఇన్స్పెక్టర్ వి సురేష్ కుమార్, ఆలయ కార్యనిర్వాహణాధికారి మానికల రాంబాబు పాల్గొన్నారు.