ఆసీస్, భారత్ మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో తొలి రోజు ఆటలో ఆసీస్ బ్యాటర్లు లబుషేన్, కాన్స్టాస్ పిచ్‌పై నడిచారు. దీంతో ఆసీస్ ఆటగాళ్లపై భారత మాజీలు సునీల్ గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డారు. పిచ్‌పై నడవొద్దని రోహిత్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అంపైర్లు చేయాల్సిన పని రోహిత్ చేశాడని గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించారు.