TG: సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రులు, ఇండస్ట్రీ నుంచి నిర్మాతలు ఉండే అవకాశం ఉంది. FDC ఛైర్మన్ దిల్ రాజు సహా ఐదుగురు లేదా ఏడుగురితో సబ్ కమిటీ ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. సబ్ కమిటీ నిర్ణయం మేరకు సమస్యల పరిష్కారం ఉండనుంది. కాగా, టికెట్ల రేట్ల అంశం సహా ఇతర సమస్యలపై కమిటీ చర్చించనుంది.