ప్రకాశం: పట్టణంలోని సాధుమియా వీధిలో ఓ విద్యుత్ స్తంభం బుధవారం ప్రమాదవశాత్తు నేలకొరిగింది. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని గుర్తించి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ స్తంభం పడే సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.