»Kotam Reddy Giridhar Reddy Joined Tdp In The Presence Of Chandrababu
TDP: చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి శుక్రవారం ప్రతిపక్ష TDPలో చేరారు. ఏపీ మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) సమక్షంలో గిరిధర్, అతని అనుచరులు పార్టీ కండువా కప్పుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి(Kotam Reddy Giridhar Reddy) శుక్రవారం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరారు. ఏపీ మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) సమక్షంలో టీడీపీ(TDP)లో జాయిన్ అయ్యారు. గిరిధర్ రెడ్డి, వారి అనుచరులు నెల్లూరు నుంచి భారీ ర్యాలీగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీలో చేరారు. చంద్రబాబు నాయుడు గిరిధర్ సహా వారి అనుచరులకు పసుపు కండువా అందించి టీడీపీలోకి చేర్చుకున్నారు. గిరిధర్ నిత్యం ప్రజల సేవలో ఉన్నారని కొనియాడారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సేవాదళ్ అధ్యక్ష పదవికి గిరిధర్‌రెడ్డి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా గిరిధర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యుడిని చేసినందుకు చంద్రబాబు నాయుడు(Chandrababu naidu)కు కృతజ్ఞతలు తెలిపారు. తన అనుచరులు, శ్రేయోభిలాషులందరినీ సంప్రదించిన తర్వాతే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గ అభివృద్ధి కోసం పాటుపడాతానని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుంచి మొత్తం 10 అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుచుకుంటుందని గిరిధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కోటా నుంచి శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు(vote) వేసిన ఒకరోజు తర్వాత శ్రీధర్ రెడ్డి టీడీపీ(TDP)లో చేరనున్నట్లు తెలుస్తోంది. గురువారం ఎన్నికలు జరిగిన ఏడు స్థానాల్లో ఒకదానిలో వైఎస్సార్సీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. టీడీపీకి చెందిన పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో గెలుపొందారు. వైఎస్సార్సీపీకి(YSRCP) చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీని గెలిపించేందుకు క్రాస్ ఓటింగ్‌కు(cross voting) పాల్పడిన నేపథ్యంలో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.