చలి నుంచి ఉపశమనం కోసం చాలా మంది రాత్రి పడుకునేటప్పుడు సాక్సులు వేసుకుంటారు. సాక్సులు వేసుకోవడం వల్ల పాదాలు వెచ్చగా, హాయిగా ఉంటాయి. దీంతో నిద్ర హాయిగా పడుతుంది. రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. అయితే తడి సాక్సులు వేసుకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. సాక్సులు తడిగా ఉంటే బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు పెరుగుతాయి. అందుకే చెమటతో తడిసిన సాక్సులు కూడా వేసుకోకూడదు.