కృష్ణా: విజయవాడ పాకిస్తాన్ కాలనీ పేరు మార్చాలని ఆ ప్రాంతంలో ఉన్న స్థానిక ప్రజలు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. తాము ఉంటున్న నివాస ప్రాంతానికి పాకిస్తాన్ కాలనీ పేరు ఉండటం తమకు అవమానంగా ఉందంటున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.