సత్యసాయి: పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్ నుండి HNSS కాలువను HNSS అధికారులు బుధవారం పరిశీలించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశాల మేరకు HNSS కాలువను అధికారులు పరిశీలించారు. వెంటనే కాలువకు అవసరమైన మరమ్మత్తులు చేసి చెరువులకు నీరు వదలడానికి యుద్ధ ప్రాతిదికన అధికారులు చర్యలు చేపడుతున్నారు.