ATP: అనంతపురం నగరంలోని అంబేద్కర్ నగర్లో అయ్యప్ప స్వామి భక్త మండలి ఆధ్వర్యంలో బుధవారం పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆలయంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.