SRD: మిషన్ భగీరథ కార్మికులకు 26 వేల రూపాయలు వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో మిషన్ భగీరథ కార్మికుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నెలకు 10 వేల రూపాయలు వేతనం ఇచ్చి శ్రమదోపటికి పాల్పడుతుందని విమర్శించారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు.