పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని అధికార పార్టీ రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. పవన్ ఇటీవల తన మూడు పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చారు. విడాకులు ఇచ్చిన తర్వాతే తాను మరో పెళ్లి చేసుకున్నానని ప్రకటించారు. అంతేకాదు.. తన మొదటి భార్యకు భరణం ఇచ్చానని.. రెండో భార్యకు ఆస్తి మొత్తం రాసి ఇచ్చానని కూడా ప్రకటించారు. దీంతో.. పవన్(pawan kalyan) మద్దతు దారులంతా రేణుదేశాయ్(renu desai) మీద పడ్డారు. డబ్బు తీసుకోని కూడా పవన్ పై ఆరోపణలు చేసిందంటూ ఆమెను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
కాగా… గతంలోనే.. తనకు పవన్ నుంచి చిల్లు గవ్వ కూడా రాలేదని రేణు చెప్పడం గమనార్హం. పవన్ కళ్యాణ్ తన నుండి విడిపోయాక తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రేణూ దేశాయ్ తాను భరణంగా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చిల్లిగవ్వ తీసుకోలేదని చెప్పింది. ‘భరణంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. ఒంటరిగానే నా పిల్లలతో బయటకు వచ్చేశాను’ అని గతంలో చెప్పింది రేణూ దేశాయ్. దాంతో ఆ మాటలను వెతికి ఇప్పుడు హైలెట్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఇందులో ఎవరు నిజం చెప్పారు.. ఎవరు అబద్ధం చెప్పారు అంటూ బాగా చర్చలు నడుస్తున్నాయి.
ఒకవేళ నిజంగా భరణం ఇచ్చి ఉంటే.. అది కోర్టులో జరిగే వ్యవహారమే కాబట్టి బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ విషయం కూడా ఎక్కడా బయటకు రాలేదు. పోనీ పెద్దల్లో జరిగింది అంటే.. ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ భరణం ఇచ్చిన విషయాన్ని బహిరంగ పరచకపోవడంతో పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమా? లేదంటే రేణూ దేశాయ్ చెప్పింది నిజమా? అన్న సందిగ్ధంలో పడ్డారు.