జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు గత జూలైలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ రాత పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను RRB తాజాగా విడుదల చేసింది. https://www.rrbcdg.gov.in/ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 7,951 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 16,17,18 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.