PLD: సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలను గురువారం రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు 80 గుడ్లు మాత్రమే అందించగా రికార్డులో 113 గుడ్లు రాయటంపై ఆమె ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఇలాంటివి చేస్తే ఉపేక్షించేది లేదని పద్మావతి హెచ్చరించారు.