ATP: ధర్మవరం కళాజ్యోతి సర్కిల్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగమణి అనే మహిళ గాయపడి అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం దొడ్డబల్లాపూర్కు చెందిన నాగమణి తన భర్తతో కలిసి బైక్పై వెళ్తుండగా ధర్మవరం కళాజ్యోతి సర్కిల్ వద్ద వెనక నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.