MBNR: కారు అదుపుతప్పి బోల్తా పడి ఒకరికి గాయాలైన ఘటన బాలానగర్ మండలం పెద్దరేవల్లి గ్రామ శివారులో గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గౌతం పల్లికి చెందిన హతిరాం నాయక్ షాద్నగర్ నుంచి గౌతంపల్లి వెళ్తుండగా..పెద్దరేవల్లి గ్రామ శివారు మోదంపల్లి గేటు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు చెప్పారు.